రౌడీ షీటర్లపై నిఘా తప్పదు: ఎస్పీ
BPT: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి వీడి సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బుధవారం పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వారి కదలికలు, జీవనశైలిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.