'బీసీల రణభేరిని విజయవంతం చేయండి'
WNP: బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈనెల 23న పాలమూరులో నిర్వహించే "బీసీల రణభేరి" బహిరంగ సభలో బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ యుగంధర్ గౌడ్ పాల్గొంటారని తెలిపారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి రణభేరి బహిరంగసభ గోడ పత్రికలను శుక్రవారం ఆవిష్కరించారు.