ఎంతోమంది ఇంజనీర్లను అందించిన వ్యక్తి: హరీష్ రావు
HYD: తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు గౌరవించే వ్యక్తి రామయ్య అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆయనను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో మంది ఇంజనీర్లను అందించిన వ్యక్తి ఐఐటీ రామయ్య అని వాఖ్యానించారు.