కూటమి హయాంలో అర్హులందరికీ పెన్షన్లు: ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో 1,210 పెన్షన్లు రీ వెరిఫికేషన్‌లో రద్దైనట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా ప్రతి నెలా పెన్షన్ అందేలా చూడాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశించారు. నకిలీ సర్టిఫికెట్ల కారణంగానే రీ వెరిఫికేషన్ జరిగిందని, బాధితులు ఆందోళన చెందవద్దని, కూటమి ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.