ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మూసాపేట మండలంలోని జానంపేట, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్, గుడిబండ మదనాపూర్ మండలం కొత్తపల్లిలో నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.