VIDEO: కళ్లాల్లోనే మొక్కజొన్న రాసులు
NTR: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మొక్కజొన్న కోసిన రైతులు నూర్పిడి యంత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు కళ్లాల్లోనే మొక్కజొన్నను రాసులుగా పోశారు. కూలీల ద్వారా కోయించడం వల్ల దిగుబడి అధికంగా కనిపిస్తుందని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.