VIDEO: గొల్లపల్లి సర్పంచ్‌కు తప్పిన ప్రమాదం
KMR: జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ సమీపంలో RTC బస్సును కారు ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వడ్లూరు వైపు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కారు ఢీకొట్టింది. రామారెడ్డి మండలం గొల్లపల్లి సర్పంచ్ అటికేల కిషన్ యాదవ్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. కారు ముందు భాగం దెబ్బతింది. ఈప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.