'కన్నుల పండుగగా ఎద్దుల జాతర కార్యక్రమం'

ADB: తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని ఎద్దుల జాతర కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో MLA అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గ్రామస్తులతో కలిసి బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.