క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యలకు పరిష్కారం

క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యలకు పరిష్కారం

BDK: ఆళ్లపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ విస్తృతంగా శనివారం పర్యటించారు. ఇళ్ల నిర్మాణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భూభారతి దరఖాస్తులు, త్రాగునీరు, పారిశుధ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.