సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్న కలెక్టర్

TPT: పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని శనివారం కుటుంబ సమేతంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. ఆయన ఆలయం వద్దకు రాగానే స్థానిక ఎమ్మెల్యే నాని, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం కలెక్టర్ దంపతులకు తీర్థప్రసాదాలను అందజేశారు.