BREAKING: శంషాబాద్ నుంచి విమానాలు రద్దు

BREAKING: శంషాబాద్ నుంచి విమానాలు రద్దు

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన 43 అలాగే హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 49 విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ ఇన్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై మండిపడుతున్నారు.