లైదాం శివానంద ధర్మక్షేత్రంలో ఘనంగా తెప్పోత్సవం

SKLM: పొందూరు మండలంలోని లైదాం శివానంద ధర్మక్షేత్రంలో శనివారం సాయంత్రం తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన వేడుకలు సోమవారం నిర్వహించనున్న శ్రీరామ పట్టాభిషేకంతో ముగించనున్నారు. నేడు సత్సంగాలు, రథోత్సవం, తెప్పోత్సవం ఘట్టాలను వైభవంగా చేపట్టారు. అనంతరం భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు.