అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
W.G: అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నరసాపురం గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులు, పరిశ్రమలలో అగ్ని భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ కొల్లు భాస్కర రావు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలకు గల కారణాలు, నివారణోపాయాలను వివరించారు. అత్యవసర సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.