'ZPTC, MPTC స్థానాలు ఎస్సీకి కేటాయించాలి'

KMR: నూతనంగా ఏర్పడిన పల్వంచ మండలంలో ZPTC, MPTC స్థానాలను ఎస్సీకి రిజర్వ్ చేయాలని మండల దళిత సంఘం నాయకులు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మండలాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు.