అధికారులతో టీడీపీ ఇంఛార్జ్ సమావేశం

అధికారులతో టీడీపీ ఇంఛార్జ్ సమావేశం

ప్రకాశం: రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. శనివారం దర్శిలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు అవసరమైన పైర్లు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్నిరకాల సహకారం అందించాలన్నారు.