కనకదాస విగ్రహావిష్కరణకు కలెక్టర్‌కి ఆహ్వానం

కనకదాస విగ్రహావిష్కరణకు కలెక్టర్‌కి ఆహ్వానం

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 8న భక్త కనకదాస కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌ను హిందూపురం ఎంపీ పార్థసారథి కలెక్టర్ కార్యాలయంలో ఆహ్వానించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.