కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీలు

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీలు

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు శుక్రవారం సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎంపీలకు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామని రామ్మోహన్, శివనాథ్ అన్నారు.