ఉరేసుకొని యువతి ఆత్మహత్య

GNTR: బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యువతి మేఘన(20) గుంటూరు లక్ష్మీపురం కృష్ణనగర్‌లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సెకండ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేకపోవడంతో మార్కులు తక్కువ వస్తాయని తీవ్ర మనోవేదనకు గురై ఈ చర్యకు ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం ఎస్సై తరంగిణి కేసు నమోదు చేశారు.