IAS దంపతులకు ఒకే చోట పోస్టింగ్
ASR: జిల్లాలో ఐఏఎస్ దంపతులకు ఒకే చోట పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐటీడీఏ పీవోగా ఉన్న తిరుమాని శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఆమె భర్త ఆదిత్యవర్మను ఐటీడీఏ పీవోగా పోస్టింగ్ ఇచ్చింది. ఇటీవలే వివాహం అయిన ఈ దంపతులు వేర్వేరు క్యాడర్లలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఒకే చోట పనిచేసేలా ఈ నియామకాలు చేసింది.