ప్రభుత్వ రహదారి ఆక్రమణపై రైతుల ఆందోళన

ప్రభుత్వ రహదారి ఆక్రమణపై రైతుల ఆందోళన

NRPT: మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డు కొత్త గార్లపల్లి ప్రభుత్వ రహదారిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 174, 171లోని పంట పొలాలకు వెళ్లే దారిని ఆక్రమించడం వల్ల 300 మందికి పైగా ఇబ్బంది పడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించాలని ఓబ్లేస్ మహారాజ్ డిమాండ్ చేశారు.