విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

WGL: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన మాందాటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు లక్ష్మణ్ గురువారం పొలం వద్ద విద్యుత్ మోటార్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి.