జీకేవీధి మండలంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
ASR: ప్రస్తుతం వరి పొలాల్లో అక్కడక్కడా మానిపండు తెగులు కనిపిస్తోందని గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు తెలిపారు. తెగులు నివారణకు ప్రొఫినోఫాస్ మందును పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మంగళవారం తీములబండ గ్రామంలో సర్పంచ్ సుభద్ర, వీఏఏ మేఘమాలతో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు.