పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 10వ డివిజన్ సరస్వతీ నగర్ ఓవెల్ మోడల్ స్కూల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైను కాలువల నిర్మాణ పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా నిర్మాణంలో పాటించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.