MNCL, కాగజ్‌నగర్ మీదుగా డెహ్రాడూన్ వరకు ప్రత్యేక రైలు

MNCL: సికింద్రాబాద్ జోన్ పరిధి చర్లపల్లి నుంచి డెహ్రాడూన్ వరకు ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి నవంబర్ 25వరకు ప్రతీ మంగళవారం చర్లపల్లిలో ఉదయం 5గంటలకు బయలుదేరి కాజీపేట (6.30), రామగుండం (7.45), మంచిర్యాల (8.00), బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా రైలు డెహ్రాడూన్ చేరుతుంది.