భక్తులతో కిటకిటలాడిన ముత్యాలమ్మ ఆలయం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం మూడో ఆదివారం సందర్భంగా పక్క గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఆలయ సిబ్బంది ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేశారు.