రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు: DAO

ASF: రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం బెజ్జుర్ మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. రిజిస్టర్‌లు, స్టాక్‌ను పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన ధరలకే రైతులకు ఎరువులు అందించాలని, అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.