'కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: కాంప్లెక్స్ సమావేశాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని మోతే మండల విద్యాధికారి గోపాల్ రావు అన్నారు. ఇవాళ మోతే మండలం ఉర్లుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగంలో వస్తున్న మార్పుల మేరకు ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలన్నారు.