సలేశ్వరం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

సలేశ్వరం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

NGKL: నల్లమల అడవిలో ఏప్రిల్ 1 నుండి 3 వరకు జరిగే సలేశ్వరం జాతర ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. అధికారులతో కలిసి ట్రెక్కింగ్ మార్గాలను పర్యవేక్షించి, భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.