ఒక్క నిర్ణయం.. రెండు పార్టీల భవిష్యత్తు..!

ఒక్క నిర్ణయం.. రెండు పార్టీల భవిష్యత్తు..!

జగిత్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాకతో పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ కేవలం ఆత్మీయ కలయికనా లేక పార్టీలోకి ఆహ్వానమా అన్న చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు మౌనం పాటిస్తుండగా రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.