మహిళ అనుమానాస్పద మృతి

మహిళ అనుమానాస్పద మృతి

ప్రకాశం: సింగరాయకొండలో సుబ్బాయమ్మ అనే మహిళ ఆదివారం అనుమానస్పద మృతి చెందింది. శనివారం రాత్రి ఎప్పటిలా ఇంటిలో నిద్రించిన మహిళ ఆదివారం నిద్ర లేవక పోయేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఆమెను గమనించడంతో ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. ఇంట్లో దొంగలు పడి బీరువాను పగలగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.