సాయిబాబా ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: సాయిబాబా మంత్రాలను పఠించడం ద్వారా వ్యక్తి తన జీవితంలో పురోగతిని అనుభవిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవెంకట సాయిబాబా మందిర 15వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని బాబావారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు.