పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
ASR: పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జిల్లా డీడీ డాక్టర్ జయరాజు రైతులకు సూచించారు. బుధవారం కొయ్యూరు మండలంలోని రావణాపల్లి, కితలోవ గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో 230 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. అలాగే 80 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించామన్నారు.