HYDలో మరో దారుణ హత్య
TG: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. కామాటిపుర పీఎస్ పరిధిలోని దేవి బాగ్ వద్ద అరవింద్ ఘోస్లే(30) అనే యువకుడిని దుండగులు కత్తులతో వెంబడించి నరికి చంపేశారు. మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.