ఫుడ్ డెలివరీ రంగంలో సరికొత్త పొత్తు

ఫుడ్ డెలివరీ రంగంలో సరికొత్త పొత్తు

దేశంలో ఫుడ్ డెలివరీ యాప్స్‌లో జొమాటో, స్విగ్గీల ఆధిపత్యాన్ని అధిగమించేందుకు మ్యాజిక్‌పిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాజిక్‌పిన్ తన రెస్టారెంట్ నెట్‌వర్క్‌ను రాపిడో యాజమాన్యంలోని 'ఓన్లీ (Ownly)' ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా మార్కెట్‌లో సరికొత్త పోటీని సృష్టించాలని, చౌకైన డెలివరీ పరిష్కారాలను అందించాలని చూస్తోంది.