యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతా: పాక్ ఎంపీ

యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతా: పాక్ ఎంపీ

భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తే తాను ఇంగ్లాండ్‌కు పారిపోతానని పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీ పట్టుకుని సరిహద్దుకు వెళ్తారా అని మీడియా ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్‌ను అడగగా.. యుద్ధం వస్తే ఇంగ్లాండ్‌కు వెళ్తానని సమాధానం చెప్పారు. అలాగే తను చెబితే ప్రధాని మోదీ యుద్ధం నుంచి వెనక్కి తగ్గరని అన్నారు.