కంప్యూటర్ల సరపరాకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు ఈనెల 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇంఛార్జ్ డీఈవో శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సీహెచ్. మల్లేష్ 9959262737ను సంప్రదించాలన్నారు.