విద్యార్థులకు కరాటేలో శిక్షణ తరగతులు
AKP: మునగపాక మండలం తాటిపల్లి కేజీబీవీలో బాలికలకు ఆత్మ రక్షణ కోసం కరాటేలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో మహిళా పోలీసులు వివరించి, ఆత్మ రక్షణకు కరాటే దోహదపడుతుందన్నారు. సైబర్ క్రైమ్, పోక్సో, రహదారి నిబంధనలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.