భారత్ రికార్డు.. వరల్డ్‌కప్ టైటిల్ కైవసం
భారత్ తొలిసారిగా స్క్వాష్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు హాంకాంగ్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. చెన్నైయ్ జరిగిన టైటిల్ పోరులో హాంకాంగ్‌పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ముందుగా జోష్న చినప్ప శుభారంభం చేసింది. ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో లీ కా యిపై 7-3, 2-7,7-5, 7-1తేడాతో గెలిచింది.