మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంపికైన అప్పలరాజు

SKLM: ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో భాగంగా విడుదలైన ఫలితాలలో ఎస్ఏగా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు ఒకేసారి నాలుగు ర్యాంకులు వచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం జి. సిగడాం జడ్పీ పాఠశాలలో ఎస్ఎగా పని చేస్తున్నానని తెలిపారు. అయితే నేడు విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా స్టేట్ 12వ ర్యాంకు వచ్చిందన్నారు.