INSPIRATION: టంగుటూరి ప్రకాశం పంతులు

తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, నవీనాంధ్ర పితగా టంగుటూరి ప్రకాశం పంతులు పేరుపొందారు. ఉజ్జ్వల దేశభక్తి, నిరుపమాన త్యాగగుణం.. మహోన్నతుడిగా మలిచాయి. గాంధీ మహాత్ముడు వంటి వ్యక్తులు ఆయన స్వభావాన్ని ప్రశంసించారు. కనికరం ఎరుగని బ్రిటిష్ తుపాకికి గుండెలు చూపిన ధైర్యశాలి- ‘ఆంధ్రకేసరి’గా కీర్తి గడించారు. ఆదర్శ నాయకుడై స్ఫూర్తినందించారు.