సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలో రూ.14 లక్షలతో నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి సర్పంచ్ పవన్ కుమార్ సోమవారం భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తమన్నారు.