వినాయకుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి

వినాయకుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: విఘ్నాలు తొలగించి శుభాలు కలిగేలా ప్రజలకు ఆశీస్సులు ప్రసాదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ గణనాథుడిని కోరారు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద కొనసాగుతున్న వినాయకుని నిమజ్జన శోభాయాత్రలో శుక్రవారం రాత్రి ఆయన పాల్గొన్నారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.