విద్యార్థులు అలెర్ట్.. ఎగ్జామ్ వాయిదా
MBNR: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.