పశు సంవర్ధక శాఖ యంత్రాంగం సేవలు అభినందనీయం
కృష్ణా: మొంథా తుఫానులో పశు సంవర్ధక శాఖ యంత్రాంగం సేవలు అభినందనీయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మొంథా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన పశు వైద్యులు, సిబ్బందిని సత్కరించి, మొంథా యోధా అవార్డులు అందచేశారు. జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ సీహెచ్.నరసింహులు పాల్గొన్నారు.