ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతం

ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతం

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఘనంగా జరిగింది. వేలాదిగా మహిళా భక్తులు ఒక్కచోట కూర్చుని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. ఆలయాధికారులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం దివ్యంగా కళకళలాడింది.