మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టి బొమ్మ దహనం
SRCL: గొల్లపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు గురువారం దగ్ధం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.