VIDEO: సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

SKLM: సీఎం సహాయ నిధి నగదును సద్వినియోగం చేసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్న పేటలో పార్టీ కార్యాలయంలో నరసన్నపేట పట్టణానికి చెందిన సింగంశెట్టి రాజు కుటుంబ సభ్యులకు రూ.20 వేలు సీఎం సహాయనిధి చెక్కుని అందజేశారు. పేదలు మెరుగైన వైద్యం కోసం ఇబ్బంది పడకుండా సీఎం సహాయ నిధి ద్వారా డబ్బులు అందజేయడం జరుగుతుందన్నారు.