'ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌లో అభివృద్ది'

'ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌లో అభివృద్ది'

NLR: నెల్లూరు రూరల్ 20వ డివిజన్‌లో రూ. 2.94 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేశ్ తెలిపారు. నెల్లూరు నక్కలగుంట శివాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో 20 డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.