పాత్రికేయుల సంక్షేమానికి కృషి: కలెక్టర్
PPM: మన్యం జిల్లాలో పనచేసే పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పాత్రికేయులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాత్రికేయులు నిరంతరం పని ఒత్తిడితో ఉంటారని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి అన్నారు.