రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థిని

PDPL: ఎలిగేడు మండలం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని మీనుగు భూలక్ష్మి, సబ్ జూనియర్ కబడ్డీ జిల్లాస్థాయి సెలక్షన్లలో ప్రతిభ కనబర్చింది. ఈనెల 25న నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు భూలక్ష్మిని అభినందించారు.